US-Israel-Iran War: యుద్ధ సమయంలో ట్రెండింగ్‌గా అరబిక్ పదం.. అర్థం ఏంటి..? ఎందుకు ట్రెండింగ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Israel-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక అరబిక్ హ్యాష్‌ట్యాగ్ వేగంగా ట్రెండ్ అవుతోంది.. అదే — #الرياض_الان… అయితే, ఈ పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్‌గా మారిపోయింది అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. అయితే #الرياض_الان.కు “రియాద్ ఇప్పుడు” (Riyadh Now). అంటే సౌదీ అరేబియా రాజధాని Riyadhలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యక్ష నవీకరణలు అనే భావం.
* ట్రెండింగ్‌కు ప్రధాన కారణాలు
1. రియాద్‌లో భారీ వర్షాలు: ఇటీవల రియాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానికులు దీనిని శుభ సూచకంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నారు. ప్రజలు వర్షపు వీడియోలు, మేఘాల దృశ్యాలు, రోడ్లపై నీరు నిలిచిన చిత్రాలు షేర్ చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులపై రియల్ టైమ్ అప్‌డేట్స్ ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకుంటున్నారు.
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
2. ప్రాంతీయ ఉద్రిక్తతలు, దాడుల ప్రభావం: ఇక, ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ చమురు సంస్థ Saudi Aramcoకు చెందిన రాస్ తనూరా శుద్ధి కర్మాగారంపై దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
రాస్ తనూరా ప్రాంతంలో జరిగిన పేలుళ్లు, అగ్ని ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భద్రత కోసం ప్రార్థనలు చేస్తూ, తాజా పరిస్థితులపై సమాచారం పంచుకుంటున్నారు. కొన్ని పోస్టుల్లో #TelAvivBlast, #IranWar వంటి ట్యాగ్‌లు కనిపిస్తున్నప్పటికీ, ప్రధాన దృష్టి రియాద్ పరిస్థితులపైనే ఉంది. అయితే, #الرياض_الان ప్రస్తుతం రియాద్ నగరంలో జరుగుతున్న ప్రతీ విషయానికి ఒక ప్రత్యక్ష సమాచార వేదికగా మారింది. అది వాతావరణం కావచ్చు, ట్రాఫిక్ పరిస్థితులు కావచ్చు, భద్రతా హెచ్చరికలు కావచ్చు.. అన్నింటినీ ఈ ట్యాగ్ ద్వారా పంచుకుంటున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు మరియు భారీ వర్షాలు ఒకేసారి చోటుచేసుకోవడంతో, ఈ హ్యాష్‌ట్యాగ్ అత్యంత చురుకైన స్థానిక ట్రెండ్‌గా మారింది.
తాజావార్తలు
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!