ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చెరలో ఉండిపోయింది. ఒక్క పంజ్‌షీర్ ప్రావిన్స్ మినహా మొత్తం తాలిబన్ల వశం అయింది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘన్ అధికారులు ఓ విషయంపై ఆందోళనలు చెందుతున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని జ్వాజియన్ ప్రావిన్స్ లో తిల్యాతోపే అనే ప్రాంతంలో పెద్ధ ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్ యూనియన్ ఆధీనంలో ఆఫ్ఘన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20,600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి బయటపడ్డాయి. ఇవి క్రీస్తుపూర్వం 1వ శతాబ్ధకాలానికి చెందినవిగా అప్పటి పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో చాలా వరకు అప్పటి సోవియట్ యూనియన్ చేతికి చిక్కాయి. మిగిలిన వాటిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నది. ఇప్పుడు ఈ విలువైన సంపద ఎక్కడ తాలిబన్ల వశం అవుతుందో అని ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారు. 1994లో ఈ సంపదను తాలిబన్ల వశం కాకుండా జాగ్రతత్తపడ్డారు. అయితే, ఇప్పుడు ఈ నిధి గురించి ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది. అనేక దేశాల్లో ప్రదర్శనకు పెట్టారు. ప్రదర్శనకు పెట్టిన వాటి నుంచి భారీగా ఆదాయం లభించింది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ సంపదపై కన్నెస్తారా? ఈ పురాతన నిధిని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంటుందా? చూడాలి.
ఆ ఖజానా తాలిబన్లు కు దక్కుతుందా?
