NTV Telugu Site icon

Kim Yo Jong: రష్యా చేతిలో ఆ ఆయుధాలు ముక్కలవుతాయి.. కిమ్ సోదరి సంచలన వ్యాఖ్యలు

Kim Yo Jong

Kim Yo Jong

West Tanks Will Burn In Ukraine Says Kim Yo Jong: ఉక్రెయిన్, రష్యా మధ్య సంవత్సర కాలం నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. గత కొంతకాలం నుంచి ఈ యుద్ధం మరింత ఉధృతమైంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులతో విరుచుకుపడుతోంది. అక్కడి విద్యుత్ వ్యవస్థలతో పాటు ఇతర కార్యాలయాల్ని టార్గెట్ చేసుకొని.. ఎయిర్‌స్ట్రైక్స్‌కి రష్యా ఎగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కి మద్దతుగా అమెరికా, జర్మనీ దేశాలు ముందుకొచ్చాయి. అమెరికా ముందు నుంచే ఉక్రెయిన్‌కి ఆయుధాలు అందిస్తుండగా.. ఇప్పుడు జర్మనీతో పాటు అమెరికా సైతం అత్యాధునిక ట్యాంకులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ట్యాంకులతో తాము ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి చేజిక్కించుకోవడానికి సహాయపడతాయని ఉక్రెయిన్ భావిస్తోంది. రష్యా బలగాల్ని ధీటుగా ఎదుర్కుకునేందుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేసింది.

Naked Woman Driving : బట్టల్లేకుండా స్కూటీ నడిపింది.. అడ్డంగా బుక్కైంది

ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమది రష్యా పక్షమేనని పేర్కొంది. తాము రష్యా సైన్యం, ప్రజల పక్షానే నిల్చుంటామని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో తమ మద్దతు పుతిన్‌ ప్రభుత్వానికేనని స్పష్టం చేసింది. ‘‘తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు రష్యా ప్రజలు దృఢంగా నిలబడ్డారు. ఉక్రెయిన్‌కు అబ్రామ్స్‌ ట్యాంకులను అందించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం చాలా నీచమైంది. మాస్కో నగరాన్ని ధ్వంసం చేయాలనే దురుద్దేశంతోనే అమెరికా ముందుకెళ్తోంది’’ అంటూ కుండబద్దలు కొట్టింది. అయితే.. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కి మద్దతుగా పంపిన ఆయుధాలన్నీ వీరోచితమైర రష్యా ఆర్మీ చేతిలో ముక్కలవుతాయని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

Caesium-137: హడలెత్తిస్తున్న చిన్న క్యాప్సుల్.. 1400 కిలోమీటర్ల మేర గాలింపు

Show comments