NTV Telugu Site icon

Russia Ukraine War: ఉక్రెయిన్ పైచేయి సాధిస్తే, మేం అణ్వాయుధం వినియోగిస్తాం.. దిమిత్రి హెచ్చరిక

Dmitry

Dmitry

We Will Use Nuclear Weapon If Ukrainian Offensive Was A Success Says Dmitry Medvedev: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడిన కొత్తలో రష్యా దాడులకు ఉక్రెయిన్ వణికిపోయింది. కొంత భూభాగాన్ని సైతం రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ పరిస్థితి అప్పట్లో దయనీయంగా తయారైంది. అయితే.. ఉక్రెయిన్ కుంగిపోలేదు. ఎదురుదాడులకు దిగి, ధీటుగానే రష్యాకి బదులిస్తూ వస్తోంది. ఇక ఈమధ్య నాటో మద్దతుతో ఉక్రెయిన్ వరుస దాడులతో తెగబడుతోంది. రష్యా కంటి మీద కినుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మిద్వెదేవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తమపై కొనసాగుతున్న ఎదురుదాడుల్లో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తే.. తాము కీవ్‌పై అణ్వాయుధ ప్రయోగం చేయక తప్పదంటూ కుండబద్దలు కొట్టారు.

Jaipur Express Gun Fire: జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి!

‘‘ఒకవేళ నాటో మద్దతుతో ఉక్రెయిన్‌ చేస్తోన్న ఎదురుదాడులు విజయవంతమై, మా భూభాగాన్ని ఆక్రమిస్తాయని భావిస్తే.. అప్పుడు మేము అణ్వాయుధం వినియోగించక తప్పుదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమకు అణ్వాయుధ ప్రయోగం తప్ప మరో అవకాశం ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే.. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మేమే గెలవాలని ఉక్రెయిన్ కోరుకోవాలి. అణ్వాయుధం పేలాలా? వద్దా? అనేది ఇప్పుడు మా శతృవుల చేతుల్లోనే ఉంది’’ అంటూ దిమిత్రి ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. కాగా.. రష్యా స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి పొందేందుకు, పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలతో ఎదురుదాడులకు దిగింది. ఈ నేపథ్యంలోనే దిమిత్ర అణ్వాయుధ ప్రయోగంపై పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

Facebook Post: సిల్లీ పోస్ట్ పెట్టాడు.. పోలీసులు అతని సరదా తీర్చారు