NTV Telugu Site icon

Joe Biden: ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చు

Joebiden

Joebiden

పశ్చిమాసియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు. ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ దిగే అవకాశం ఉందా? అని ప్రశ్నకు బైడెన్ సమాధానం ఇచ్చారు. ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్‌ను అనుమతించబోమన్నారు. ప్రతీకార దాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Kia EV9: కియా ఎలక్ట్రిక్ SUV విడుదల.. ఒక్క ఛార్జింగ్‌తో 561 కి.మీ

రెండ్రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై 180 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. వీటిని అమెరికా సాయంతో గగనతలంలోనే పేల్చేశాయి. కొన్ని మాత్రం టెల్‌అవీవ్, జెరూసలేం సమీపంలో పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరాన్ చమురు కేంద్రాలు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Classical language: మరాఠీ, బెంగాలీతో సహా 5 భాషలకు “క్లాసికల్ హోదా”.. 11 చేరిన సంఖ్య..

ఇక లెబనాన్‌పై గురువారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తొమ్మిది మంది మరణించినట్లు తెలిపింది. బషౌరాలో ఇస్లామిక్ హెల్త్ కమిటీకి చెందిన ఏడుగురు పారామెడిక్స్ మరియు రెస్క్యూ వర్కర్లు మరణించారని హిజ్బుల్లా తెలిపింది. గురువారం తెల్లవారుజామున జరిగిన దాడిలో మరో 14 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..

Show comments