NTV Telugu Site icon

జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి…

భూమికి ప్ర‌త్యామ్నాయ గ్ర‌హం కోసం నాసా అనేక సంవ‌త్సరాలుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  చంద్రునిపై మ‌నిషి నివ‌శించేందుకు అనువుగా ఉన్న‌దా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  అదేవిధంగా, అటు గురుగ్ర‌హంపై కూడా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టికే నాసా రోవ‌ర్ గురుగ్ర‌హంపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  గురు గ్ర‌హంతో పాటుగా ఆ గ్ర‌హానికి చెందిన చంద‌మామ గానీమీడ్ పై కొన్ని రోజులుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఇందులో భాగంగా నాసాకు చెందిన హ‌బుల్ టెలిస్కోప్ కొంత స‌మాచారాన్ని సేకరించి భూమిమీద‌కు పంపింది.  గానీమీడ్ ఉప‌రిత‌లంపై ఐస్ ఘ‌న‌రూపం నుంచి నేరుగా వాయురూపంలోకి మారుతుంద‌ని, ఆ స‌మ‌యంలో నీటి ఆవిరి ఏర్ప‌డుతున్న‌ట్టు హ‌బుల్ టెలిస్కోప్ సేక‌రించిన డేటాను విశ్లేషించిన ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

Read: పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన త్రిష

దీంతో ఆ గ్ర‌హంపై జీవీ జీవించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.  భూమిమీదున్న మ‌హాసాగ‌రాల‌న్నింటిలో ఉన్న నీటి కంటే ఎక్కువ నీరు గానీమీడ్ చంద‌మామ‌పై ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌ల అంచ‌నా, అయితే, అతి శీత‌ల పరిస్థితుల కార‌ణంగా ఉప‌రిత‌లం మీది నీరు ఘ‌నీభ‌వించి ఉంద‌ని నాసా చెప్తున్న‌ది.  గానీమీడ్ చంద‌మామలో బ‌ల‌హీన అయ‌స్కాంత క్షేత్రం ఉంద‌ని, వాతావ‌ర‌ణంలో హెచ్చుత‌గ్గుద‌ల కార‌ణంగా ఉప‌రిత‌లం మీదున్న మంచు స్వ‌ల్ప ప‌రిమాణంలో నీటి అణువులుగా ఆవిరి రూపంలో విడుద‌ల‌యిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.