NTV Telugu Site icon

Pakistan: టీవీ లైవ్ డిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. పాకిస్తాన్ అంటే ఇంతే మరి..!

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఇదే కాకుండా ఆ దేశంలో రాజకీయ అస్థిరత దేశ పరిస్థితులను మరింతగా దిగజారుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దైంది. తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్, మాజీ ప్రధాని అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్నాడు. ఇక మరో ప్రధాన పార్టీ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్ లండన్ లో ప్రవాసంలో ఉన్నాడు. పాకిస్తాన్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Read Also: ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..

ఇదిలా ఉంటే ఆ దేశంలో మాత్రం ఈ పార్టీల కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. తాజాగా ఓ టీవీ డిబెట్ లైవ్ లోనే పీటీఐ, ముస్లిం లీగ్ పార్టీ మద్దతుదారులు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. యాంకర్ ఆపే ప్రయత్నం చేసినా కూడా.. గల్లాలు పట్టుకుని మరీ ఫైటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు నచ్చినట్లుగా కామెంట్స్ పెడుతున్నారు.

పీటీఐ మద్దతు ఇచ్చే న్యాయవాది అఫ్జల్ మర్వాత్, ముస్లిం లీగ్ సెనెటర్ అఫ్నానుల్లా ఖాన్ మధ్య మాటామాటా పెరిగింది. ఇరువురు ఒకరి అభిప్రాయాలపై మరొకరు విభేదించి కొట్లాటకు దిగారు. అఫ్జల్ మర్వాత్ తన కుర్చీ నుంచి లేచి అఫ్నానుల్లా ఖాన్ ను చెప్పపై కొట్టడం వీడియో చూడవచ్చు. యాంకర్ వీరిద్దరిని శాంతిపచేసే ప్రయత్నం చేసినా గొడవ సద్దుమనగలేదు. ఇద్దరు స్టూడియోలో ఫ్లోర్ పై పడ్డారు. దీనిపై ఆ దేశ ప్రజలు సెటైరికల్ గా ట్వీట్స్ చేస్తున్నారు.