Site icon NTV Telugu

USA: “ఫ్లాష్ మాబ్” తరహాలో యాపిల్ స్టోర్‌ని కొల్లగొట్టారు.. వీడియో వైరల్..

Usa

Usa

USA: అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఘరానా దోపిడి జరిగింది. క్షణాల్లో యాపిల్ స్టోర్లు, ఇతర షాపుల్ని కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ దోపిడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 100 మందికి పైగా ముసుగులు ధరించిన యువకులు ఫిలడెల్ఫియాలోని సిటీ సెంటర్ షాపుల్లోకి చొరబడి దోచుకున్నారు. మంగళవారం రాత్రి ‘ప్లాష్ మాబ్’ తరహాలో దోపిడికి పాల్పడ్డారు.

ఈ దోపిడికి ముందు రోజు శాంతియుతంగా ఓ నిరసన కార్యక్రమం జరిగింది. సరిగ్గా అలాగే తర్వాత రోజు నిరసన పేరుతో ఒక్కసారిగా దొంగలు షాపులపై విరుచుకుపడ్డారు. ఎడ్డీ ఇజారీ అనే డ్రైవర్ ని కాల్చి చంపిన కేసులో ఫిలడెల్ఫియా పోలీస్ అధికారిపై హత్య ఆరోపణలు కొట్టివేయాలని న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

Read Also: Birhor Community: చెల్లెలికి అమ్మగా మారిన ఐదేళ్ల బాలిక.. ఈ అడవి బిడ్డల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది!

అయితే జడ్జి నిర్ణయానికి వ్యతిరేకంగా దోపిడి ముందు రోజు జరిగిన నిరసనలకు, తర్వాత జరిగి దోపిడికి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. యువకులు ఆపిల్ స్టోర్ ని లక్ష్యంగా పెట్టుకుని దోపిడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దోపిడి చేసి పారిపోతున్న యువకుల్లో కొంతమందిని అధికారులు వెంబడించి పట్తటుకున్నారు. వారిని నుంచి ఐఫోన్లు, ఐఫ్యాడ్ లను స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక న్యూస్ పేపర్ల కథనం ప్రకారం ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందికి పైగా నేరస్తుల్ని అరెస్ట్ చేశామని, అర్థరాత్రి వరకు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి అనేక వీడియోలో వైరల్ గా మారాయి. ఇందులో దోపిడికి పాల్పడిన యువకులే కొన్నింటిని చిత్రీకరించినట్లు తెలిసింది.

https://twitter.com/ClownWorld_/status/1706865320626155934

Exit mobile version