NTV Telugu Site icon

Israel-Hamas War Resume: ఇజ్రాయిల్, హమాస్‌ మధ్య ముగిసిన స్వాప్ డీల్.. పునఃప్రారంభమైన వార్..

Untitled 6

Untitled 6

Israel-Hamas War Resume: ప్రంపంచ దేశాల నేతృత్వంలో ఇజ్రాయిల్ అలానే హమాస్‌ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాగా ఈ తాత్కాలిక ఒప్పందం వారం రోజుల తరువాత ఈరోజు ముగిసింది. కాగా ఒప్పందం ముగిసిన క్షణాలలోనే ఇజ్రాయిల్ హమాస్ పైన ఇజ్రాయిల్ దాడులను పునః ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని.. ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ ప్రారంభమైందని పేర్కొన్నారు. కాగా యుద్ధం పునః ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మరణాలు నమోదైయ్యాయి అని పాలస్తీనా ఆరోగ్య శాఖా అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. ఇరుదేశాల మధ్య సంధి ముగిసిన మొదటి 90 నిమిషాలలో ఆటోమేటిక్ ఆయుధాలు కాల్పుల జల్లును కురిపించాయి.

Read also:Sreemukhi: ఆరంజ్ డ్రెస్సుతో ఆకట్టుకుంటున్న బుల్లితెర బ్యూటీ…శ్రీముఖి

ఒక్కసారిగా ఆ ప్రాంతం పేలుళ్ల శబ్దాలతో ఉల్లిక్కి పడింది. కాగా గాజా లోని హమాస్ లక్ష్యాలపై ఫైటర్ జెట్‌లు ప్రస్తుతం దాడి చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలానే దక్షిణ గాజా లోని రఫా లోని అల్-నజర్ ఆసుపత్రి డైరెక్టర్ మార్వాన్ అల్-హమ్స్, ఇజ్రాయెల్ ఉత్తర భూభాగాన్ని విడిచిపెట్టమని హెచ్చరించారు. దీనితో చాలా మంది పాలస్తీనియన్లు అక్కడి నుండి పారిపోయారు. కాగా ఈ దాడుల్లో మొదటి 60 నిమిషాల్లో నలుగురు చిన్నారులతో పాటుగా మొత్తం 9 మంది మరణించారని తెలిపారు. కాగా యుద్ధం తిరిగి ప్రారంభమైన గంటలో గాజా సమీపం లోని అనేక ప్రాంతాల చుట్టూ సంభావ్య క్షిపణి కాల్పుల హెచ్చరిక సైరన్‌లు వినిపించాయని.. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంతో సహా ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను పునఃప్రారంభిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.