NTV Telugu Site icon

Sri Lanka: మొదలైన శ్రీలంక అధ్యక్ష ఓట్ల లెక్కింపు.. కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడి

Srilanka

Srilanka

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయని ఎన్నికల కమిషన్‌ ఛైర్మన్‌ ప్రకటించారు. పోలింగ్ ముగిసిన వెంటనే పోస్టల్ ఓట్ల లెక్కింపు.. తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఫలితాలు వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: UP: బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

రెండేళ్ల క్రితం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ సింఘేతో పాటు నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ)కు చెందిన అనుర కుమార దిసనాయకే (56), సమగి జన బలవేగయ(ఎస్‌జేబీ) పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్‌ ప్రేమదాస(57) పోటీ పడ్డారు. పోటీలో ఉన్నవారిలో ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇప్పటి వరకు శ్రీలంకలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ రెండో రౌండ్‌ వరకు వెళ్లిన దాఖలాలు లేవు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. మొత్తానికి తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Rajinikanth: ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సినిమా పెద్ద హిట్‌.. ఆడియో వేడుకలో రజినీకాంత్