Volodymyr Zelenskyy Warns Of New World War If China Allies With Russia: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంపై చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాకు చైనా మద్దతు ఇస్తే.. ఇది కచ్ఛితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. రష్యాకు మద్దతు ప్రకటించకుండా.. చైనా తమ పక్షాన ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. కానీ.. అది దాదాపు సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్ని చైనా విశ్లేషించుకుంటే మంచిదని, ఎందుకంటే రష్యాతో ఆ దేశం చేతులు కలిపితే మాత్రం ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయం చైనాకి కూడా తెలిసే ఉంటుందని తాను అనుకుంటున్నానని వెల్లడించారు. ఇదే సమయంలో మాల్డోవాలో సాగుతున్న తిరుగుబాటు పరిస్థితులపై జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. తనకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆ దేశ అధ్యక్షురాలు మైయ సందుకు అందజేశానన్నారు. అక్కడ రష్యా అనుకూల వర్గాలు తిరుగుబాటుకు యత్నిస్తున్నాయని తాము సమాచారం ఇచ్చామని.. ఇందుకు ఆమె తమకు ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు. మాల్డోవా రక్షణకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని హామీ ఇచ్చారు.
Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుండగా.. గత వారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మ్యూనిక్, రక్షణ సదస్సులో చైనా దౌత్యవేత్త వాంగ్‌యీను హెచ్చరించారు. రష్యాకు పరికరాల సహాయం అందిస్తే.. అందుకు చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై ఒక ఏడాది అయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఏ దేశానికి వెళ్లినా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే వెళ్లే బైడెన్.. ఈసారి అందుకు భిన్నంగా సీ-32 విమానంలో బయలుదేరారు. ఈ పర్యటనలో కొద్ది మంది అధికారులు, మెడికల్ టీం, అసోసియేటెడ్ ప్రెస్‌కి చెందిన ఫోటోగ్రాఫర్, వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన రిపోర్టర్ మాత్రమే బైడెన్ వెంట వెళ్లారు.
Prithvi Show Issue: పృథ్వీ షా గొడవలో కొత్త ట్విస్ట్.. రివర్స్‌లో కేసు పెట్టిన సప్నా గిల్