Site icon NTV Telugu

Italy: మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం.. ఎయిర్‌పోర్టు మూసివేత

Us

Us

ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరోసారి భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున బూడిద వెదజల్లుతోంది. బూడిద కారణంగా ఇటలీలోని కాటానియా విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.

మౌంట్ ఎట్నా విస్ఫోటనం కారణంగా మంగళవారం తూర్పు సిసిలీలోని కాటానియా విమానాశ్రయంలో విమానాలు నిలిపివేయబడ్డాయి. తూర్పు సిసిలీకి విమానాశ్రయం కీలకమైంది. బూడిద కారణంగా ఈ నెల ప్రారంభంలోనే ఎయిర్‌పోర్టు మూసివేశారు. తాజాగా మళ్లీ భారీ విస్ఫోటనం జరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మౌంట్ ఎట్నా నుంచి వేడి బూడిద, లావాను వెదజల్లుతోంది. దీంతో రాకపోకలు నిలిపేశారు.

ఇది కూడా చదవండి: Game Changer: గేమ్ చేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్

పర్యాటక సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వచ్చాయని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన ఎట్నా, ఇటీవలి రోజుల్లో వేడి బూడిద మరియు లావాను వెదజల్లుతూ తీవ్రప్రభావం చూపించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో మొత్తం రాకపోకలు అన్ని నిలిపివేశారు. మరికొన్ని విమానాల రాకపోకలు మళ్లించారు. బూడిద తగ్గిన తర్వాతే.. విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ethiopia: ఇథియోపియాను ముంచెత్తిన వరదలు.. 157 మంది మృతి

Exit mobile version