NTV Telugu Site icon

Putin: 8 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు పుతిన్ పిలుపు..

Putin

Putin

Putin: రష్యా ఎప్పుడూ లేనంతగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైశాల్యపూరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న రష్యాలో అందుకు తగ్గట్లుగా జనాభా లేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత దాదాపుగా 3 లక్షల మంది మరణించారు. దీనికితోడు 1990 నుంచి ఆ దేశంలో జననాల రేటు క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా జనభాను పెంచడమే ‘‘ రాబోయే దశాబ్ధాల్లో మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ విషయం చెప్పారు.

‘‘మన జాతి ప్రజలు చాలా మంది నాలుగైదు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో బలమైన బహుళజాతి కుటుంబాలను కలిగి ఉన్న సంప్రదాయం ఉంది. రష్యన్ కుటుంబాలు, మా అమ్మమ్మలు, ముత్తాతల కాలంలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి’’ అని పుతిన్ అన్నారు. మేము ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుందాం, పునర్జీవింపచెద్ధాం, పెద్ద కుటుంబాలకు రష్యా కట్టుబడాలని, ఇది జీవన విధానంగా మారాలని, కుటుంబం దేశానికి, సమాజానికి పునాది మాత్రమే కాదని, ఇది ఆధ్యాత్మిక విషయమని, నైతికతకు మూలమని పుతిన్ వెల్లడించారు.

Read Also: Israel-Hamas War Resume: ఇజ్రాయిల్, హమాస్‌ మధ్య ముగిసిన స్వాప్ డీల్.. పునఃప్రారంభమైన వార్..

రష్యా జనాభాను సంరక్షించడం, పెంచడం రాబోయే దశాబ్ధాల్లో, రాబోయే తరాలకు మా లక్ష్యమని, ఇది శాశ్వతమైన రష్యా భవిష్యత్తు అని చెప్పారు. తన ప్రసంగాన్ని రష్యా అధ్యక్షుడి అధికార వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపుగా 3 లక్షల మంది రష్యన్లు మరణించడమే కాకుండా, 8.2 లక్షల నుంచి 9.2 లక్షల వరకు ప్రజలు దేశాన్ని వదిలిపారిపోయారని రష్యన్ నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమదేశాలు విధించిన ఆంక్షల కారనంగా రష్యా తీవ్రమైన శ్రామిక శక్తి కొరతనున, ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. జనవరి 1, 2023న రష్యా జనాభా 146,447,424గా ఉందని, 1999లో పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఉన్న సంఖ్య కంటే తక్కువగా ఉందని ఇండిపెండెంట్ పేర్కొంది.