putin orders partial mobilization of citizens: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధబలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. వెస్ట్రన్ దేశాల బెదిరింపులకు రష్యా దగ్గర సమాధానం ఉందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రష్యా దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడితే.. మా ప్రజలను రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని ఆయన అన్నారు. మాకు ఓపిక నశించిందని.. అణుబాంబులు వేసే సమయం వచ్చిందని.. ఇదంతా డ్రామా అని అమెరికా దాని మిత్రదేశాలు అనుకుంటే పొరపాటే అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు పుతిన్. రష్యా దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయని.. ఉక్రెయిన్ ను నలువైపుల నుంచి ముట్టడించేంకు 3 లక్షల సైన్యాన్ని పంపిస్తున్నట్లు వెల్లడించారు.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారిగా పాక్షిక సైనిక సమీకరణకు రష్యా పిలుపునిచ్చింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లోని లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రావిన్స్‌లు, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను శాశ్వతంగా రష్యాలో అంతర్భాగాలుగా చేసుకునేందుకు పుతిన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. దీని కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని రష్యా యోచిస్తోంది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని బలగాలు ఉక్రెయిన్ పోరాటంలో చేరే అవకాశం ఏర్పడింది.
Read Also: Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ఎందుకింత గందరగోళం..?
ఇటీవల రష్యా సేనలు కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చాయి. వీటి మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. అయితే ఉక్రెయిన్ తో పాటు పశ్చిమ దేశాలు శాంతిని కోరుకోవడం లేదని.. రష్యా, దాని భూభాగాలను రక్షించుకునేందుకు 2 మిలియన్ల బలమైన సైనిక పాక్షిక సమీకరణ అవసరం అని పుతిన్ అన్నారు. పుతిన్ వ్యాఖ్యలపై బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఆహార సంక్షోభం నెలకొందని బ్రిటన్ విదేశాంగ మంత్రి గిలియన్ కీగన్ అన్నారు. 2014లో డోన్ బాస్ ప్రాంతాన్ని రష్యా పాక్షికంగా ఆక్రమించింది అప్పటి నుంచి దీన్న ప్రత్యేక స్వతంత్య్ర రాష్ట్రాలుగా రష్యా పరిగణిస్తోంది. ప్రస్తుతం డోన్ బాస్ లోని 60 శాతం భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. ఈ నెలలో ఖార్కీవ్ ప్రావిన్సు నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. అయితే వచ్చే రోజుల్లో ఉక్రెయిన్ తో యుద్ధ మరింతగా పెరగే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను రష్యా అధికారికంగా తనలో కలుపుకోవాలని అనుకుంటోంది.
