Vivek Ramaswamy:భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడినైతే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు క్షమాభిక్ష పెడతానన్నారు. ఓ టీవీ షోలో వివేక్ రామస్వామి పలు విషయాలపై మాట్లాడారు. అయితే తన ప్రధాన ఉద్దేశం మాత్రం అమెరికాను ముందుకు తీసుకువెళ్లడమే అని తెలిపారు. ట్రంప్ అయినా తాను అయినా ఫస్ట్ అమెరికా అన్న దానికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలోకి దిగేందుకు నామినేషన్ కోసం భారత సంతతికి చెందన వివేక్ రామస్వామి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పొటీ పడుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ గురించి మాట్లాడిన మొదటి రోజే వివేక్ అందరిని ఆకర్షించారు. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ పార్టీ నామినేషన్ ట్రంప్ కు దక్కితే తన పూర్తి మద్దతు ట్రంప్ కే ఉంటుందన్నారు.
Also Read: Puducherry: గుడ్ న్యూస్.. ఆడపిల్ల పుడితే రూ. 50వేలు
పాలసీల విషయంలో ట్రంప్ ది తనది ఒకే విధమైన ఆలోచనా విధానమన్నారు. ఒక వేళ తాను అధ్యక్షుడినైతే ట్రంప్ పై నమోదైన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదిస్తానంటూ వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మొదటి నుంచి తనకు ట్రంప్ కంటే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ముఖ్యమని వివేక్ తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారికే తన ఓటు అని ప్రకటించారు. అయితే ఈ బాధ్యతలకు జో బైడెన్ సరికాదని తన ఉద్దేశ్యమని వివేక్ పేర్కొన్నారు. అంతేకాకుండా జో బైడెన్ తరువాత వచ్చే కమలా హారిస్ లేదా మరొకరో కూడా అధ్యక్ష పదవికి అర్హులు కాదన్నారు.
దేశాన్ని ముందకు తీసుకు వెళ్లడానికి ఎవరు సమర్ధులో ఓటు వేసే ముందు ఆలోచించుకొని వారికి వేస్తానని వివేక్ పేర్కొ్న్నాడు. దేశంలో మళ్లీ స్ఫూర్తిని నింపాలని వివేక్ అన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం డొనాల్డ్ ట్రంప్ కంటే, రాజకీయాల కంటే కూడా ఎంతో పెద్దదని వివేక్ తెలిపారు.ఇక వివేక్ తన ప్రభుత్వంలో గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడని ట్రంప్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. దీని తరువాత ట్రంప్ కు తనుకు స్వల్ప విబేధాలు ఉన్నాయన్న విషయం నిజమేనని వివేక్ ప్రకటించారు. అయితే పాలసీల విషయంలో తమ అభిప్రాయాలు ఒకటే అని కూడా వివేక్ తెలిపారు. దీంతో ట్రంప్ కు క్షమాభిక్ష పెడతా అన్న వివేక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.