బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ప్రమాదకరమైన ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బంగ్లాదేశ్ ముగ్గురు వ్యక్తులు ట్రైన్ బోగి మధ్యలో కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా రైల్వే భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడాన్ని కూడా బహిర్గతం చేస్తుంది.
Read Also: ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ లోని ఓ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. రైలు రెండు కోచ్ ల మధ్య ముగ్గురు వ్యక్తులు చాలా ప్రమాదకరంగా కూర్చున్నారు. ఇలా కూర్చున్నప్పటికి పై నుంచి ఎవరో వీడియో తీసారు. అంటే బోగి పైన కూడా కూర్చున్నట్లు అర్థమవుతుంది. వారు ప్రయాణించే విధానాన్ని బట్టి చూస్తే.. కొంచెం అటు ఇటైనా పై ప్రాణాలు పైకి పోతాయి. అంటే దీన్ని బట్టి అక్కడ ఉన్న రైల్వే భద్రాతా నియమాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది.
Read Also:Beggar Woman: వామ్మో.. ఆమె దగ్గర అన్ని పైసలా.. నోరెళ్లబెట్టిన జనం..
సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ కాగానే.. తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న భద్రతా వ్యవస్థపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఇది ప్రాణాంతకమైన స్టంట్ అని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
