Site icon NTV Telugu

Vladimir Putin: పుతిన్ ఆరోగ్యానికి ఏమైంది.. వైరల్ అవుతున్న వీడియో..

Putin

Putin

Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయనకు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని పలు నివేదికలు కూడా వెలువడ్డాయి. తాజాగా, మరోసారి పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆయన కుడి చేతి వాపుగా ఉందని ఈ వీడియో చూపిస్తోందని న్యూస్ వీక్ నివేదించింది.

Read Also: True 8K వీడియో రికార్డింగ్, AI ఆధారిత ఎడిటింగ్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో MAX2 ప్రొఫెషనల్ కెమెరా లాంచ్..!

73 ఏళ్ల రష్యా అధ్యక్షుడికి సంబంధించిన వీడియోలో ఆయన కుడి చేతి ముడతలు పడి, నరాలు ఉబ్బి ఉన్నట్లు చూపిస్తోంది. పుతిన్ అసౌకర్యంగా కనిపంచారని, రష్యన్ హెల్తీ ఫాదర్‌ల్యాండ్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 22 ఏళ్ల యెకాటెరినా లెష్చిన్స్‌కయాను కలిసినప్పుడు ఆయన చేతులు పిడికిలి బిగించి ఉన్నట్లుగా ఎక్స్‌ప్రెస్ యూకే తెలిపింది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు ఆంటన్ గెరాష్చెంకో ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘ఈ వీడియోలో పుతిన్ చేతులకు ఏమైంది.?’’ అని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పుతిన్ నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అనుమానించారు. కొంత మంది యూజర్లు ఆయన లక్షణాలు పార్కిన్సన్స్ వ్యాధితో పోల్చారు. గతంలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో, ఆయన సైనిక పర్యటన సమయంలో పుతిన్ కుడి చేతిపై నల్లని మచ్చలు కనిపించడం ఆందోళనలను రేకెత్తించింది.

Exit mobile version