Site icon NTV Telugu

Viral Video: షాపింగ్‌ మాల్‌ లో అమాంతం భూమిలోకి పడిపోయిన మహిళ.. చివరకి..?!

14

14

సోషల్ మీడియాలోప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా ఓ భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే నిజంగా ఒక్కసారిగా మనిషినిలో వణుకు పుడుతుంది. మనం నిలబడిన చోట ఒక్కసారిగా నేల కుంగిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో హఠాత్తుగా నేల కుంగి పోయింది. అందులో ఓ మహిళ పడిపోయింది. మహిళా షాపింగ్ కోసం వచ్చిన సమయలో షాపింగ్ మాల్ లో ఓ దుకాణంలో బట్టలను చూస్తున్న సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

Also Read: Jeevan Reddy: ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర..

ఇక ఈ వీడియోకు సంబంధించి కొన్ని మీడియా కథనాలు ప్రకారం చూస్తే.. ఈ సంఘటన తూర్పు చైనాలో జరిగింది. మార్చి 23 న ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం సింక్ హోల్ అని అర్థమవుతోంది. ఈ సింక్ హోల్ కారణంగా ఆ మహిళలతోపాటు.. కొన్ని బట్టలు కూడా ఆమెతో పాటు భూమిలో పడిపోయాయి. వీటితోపాటు కింది ఫ్లోర్ లో ఓ నిర్మాణ కార్మిక కార్మికుడు కూడా శిబిరాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

Also Read: Paripoornananda: హిందూపురం టికెట్‌ నాకే వస్తుంది.. నా లక్ష్యం, సంకల్పాన్ని వీడను..!

ఇక ఈ విషయం సంబంధించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా.. వారు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఇక సింక్ హోల్ కారణంగా భూమి లోకి పడిపోయిన మహిళ, అలాగే భవన నిర్మాణ కార్మికుడికి ఫ్రాక్చర్ జరిగాయి. ఈ సంఘటనలో గాయపడిన ఇద్దరు పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మనకు కూడా అనుకోకుండా ఇలా జరుగుతే మాత్రం కచ్చితంగా గుండె ఆగిపోయేంత పని అవుతుంది.

Exit mobile version