NTV Telugu Site icon

Viral Video: కెనడాలో భారత యువతిపై హింసాత్మక దాడి.. షాకింగ్ వీడియో..

Viral Video

Viral Video

Viral Video: కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను టార్గెట్‌గా చేస్తూ దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా కెనడాలోని కాల్గరీలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బౌ వ్యాలీ కాలేజ్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి భారతీయ యువతిపై హింసాత్మక దాడి చేశాడు. ప్లాట్‌ఫామ్‌ ఉన్న యువతి గొంతు పట్టుకుని, హత్యాయత్నానికి పాల్పడ్డారు.

Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్కడ కొంత మంది ఉన్నప్పటికీ ఘటనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, క్రమంగా గుంపు పెరుగుతుండటంతో నిందితుడు, అమ్మాయిని వదిలి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సదరు వ్యక్తి, భారతీయ యువతిపై ఎందుకు దాడి చేయాలనుకున్నాడనే వివరాలు వెల్లడి కాలేదు. ఆ అమ్మాయి గుర్తింపు కూడా తెలియలేదు. గతేడాది డిసెంబర్‌లో కెనడాలోని సర్రేలో, హర్యానా కురుక్షేత్రకు చెందిన తస్కా మిరాజీ గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళను దుండగులు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 14న గిల్డ్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఆమె అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లో ఆమెపై దాడి జరిగింది.