Elon Musk: లండన్‌లో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరుగుతున్న ‘‘వలసల వ్యతిరేక’’ ఆందోళనలు మిన్నంటాయి. లక్షకు పైగా ప్రజలు లండన్ వీధుల్లో మార్చ్ చేశారు. ‘‘యునైట్ ది కింగ్‌డమ్’’ ర్యాలీలో ఏకంగా 1,10,000 మంది జనాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. వలస వ్యతిరేక ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగిస్తూ , సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో పాలన మార్పుకు మస్క్ పిలుపునిచ్చారు.
దేశం విధ్వంసం అంచున ఉందని మస్క్ హెచ్చరించారు. నిరసనకారులకు ఇప్పుడు రెండే ఎంపికలు ఉన్నాయని, ‘‘తిరిగి పోరాడటం లేదా చనిపోవడం’’, హింసకు ఆసన్నమైందని హెచ్చరించారు. బ్రిటన్ ఇప్పటికే నెమ్మదిగా ధ్వంసమవుతోందని, ఇది త్వరలో దేశం పూర్తిగా విధ్వంసానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ‘‘ బ్రిటిష్ వారిగా ఉండటంలో ఏదో అందమైన విషయం ఉంది. ఇప్పుడు బ్రిటన్ నాశనం అవడం చూస్తున్నాం. బ్రిటన్ నెమ్మదిగా కోతకు గురవుతోంది. కానీ ఇప్పుడు అది భారీ అనియంత్రిత వలసలతో మరింత వేగంగా ధ్వంసమవుతోంది’’ అని అన్నారు.
Read Also: RG Kar Medical College: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని మృతి.. లవర్‌పై పేరెంట్స్ ఆరోపణ..
నిరసనకారులను ఉద్దేశించి మస్క్ మాట్లాడుతూ.. ‘‘ ఇది ఇలాగే కొనసాగితే, మీ పైకి హింస వస్తుంది. మీకు వేరే మార్గం ఉండదు. మీరు హింసను ఎంచుకున్నా, లేకున్నా మీపైకి తప్పకుండా హింస వస్తుంది. మీరు తిరిగి పోరాడాలి లేదా చనిపోవాలి, ఇదే నిజం’’ అని అన్నారు. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నేరుగా పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని కోరుకున్నారు. పార్లమెంట్ రద్దు చేసి, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఇటీవల హత్యకు గురైన ట్రంప్ మద్దతుదారు, రైటిస్ట్ చార్లీ కిర్క్ హత్యను మస్క్ ప్రస్తావించారు. రాజకీయ వామపక్షాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తన స్నేహితుడు కిర్క్‌ను హత్య చేశారని, లెఫ్టిస్టు ప్రజలు దీనిని వేడుకగా జరుపుకున్నారని అన్నారు.
