Site icon NTV Telugu

Russia: రష్యాలో కుప్పకూలిన విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు దుర్మరణం..!

Plane Acrash

Plane Acrash

Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 65 మంది యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం కుప్పకూలింది. క్రాష్ తర్వాత విమానం మంటల్లో చిక్కుకుంది. రష్యాకు చెందిన IL-76, హెవీ లిఫ్ట్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ 65 మంది ఉక్రెయిన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్(POWs)తో ప్రయాణిస్తున్న సమయంలో రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది. విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ప్రమాదం సమయంలో విమానం నేరుగా భూమి వైపు దూసుకువస్తుండటం కనిపిస్తుంది. ఈ దృశ్యాలను చూస్తే విమానం పైలట్ నియంత్రణలో లెనట్లుగా ఉంది.

Read Also: Vishal : ‘రత్నం’ షూటింగ్ పూర్తి.. ‘డిటెక్టివ్ 2’ పై ఫోకస్ పెట్టిన విశాల్..

విమాన కూలిన ఘటనను రష్యా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పట్టుబడిన 65 మంది ఉక్రెయిన్ సైనికులను, యుద్ధ ఖైదీల మార్పిడి కోసం బెల్గోరోడ్ ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానంలో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు ఎస్కార్ట్స్ ఉన్నారు. బెల్గోరోడ్ రాజధానికి ఈశాన్యంలో ఉన్న కోరోచన్స్కీ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు.

Exit mobile version