Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venezuela Earthquake: వెనెజువెలాలో ఇటీవల సంభవించిన వినాశకరమైన రెండు భూకంపాల నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరోసారి భూమి కంపించింది. తాజాగా 4.9 తీవ్రతతో నమోదైన భూకంపం దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టించి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇప్పటికే సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా 900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విపత్తుతో అనేక నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో సహాయక బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో తాజాగా సంభవించిన 4.9 తీవ్రత భూకంపం ప్రజల్లో మరోసారి భయాన్ని రేకెత్తించింది. భూకంప ప్రకంపనలు రావడంతో పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎప్పుడైనా మరోసారి బలమైన భూకంపం సంభవిస్తుందేమోనన్న ఆందోళనతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, దెబ్బతిన్న ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. భూకంపాల ప్రభావంతో సాధారణ జీవనం ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడలేదు. తాజా భూకంపం ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది..
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!