NTV Telugu Site icon

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన

Pope Francis

Pope Francis

పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని.. దీంతో దేహం చికిత్సకు సహకరించడం లేదని పేర్కొంది. గొట్టం ద్వారా ఆక్సిజన్ అందుతోందని తెలిపింది. పోప్ మంచి దృక్పథం కలిగిన వ్యక్తిగా వాటికన్ అభివర్ణించింది.

ఇది కూడా చదవండి: Amaravati ORR: అమరావతి అభివృద్ధిలో మరో ముందడుడు.. కేంద్రం గెజిన్ నోటిఫికేషన్..

పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 14న ఆరోగ్యం బాగోలేకపోవడంతో రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని.. విషమంగానే ఉందని గత శనివారం వాటికన్ తెలిపింది. ఆదివారం కూడా అదే ప్రకటన చేసింది. పోప్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇక శనివారం రెండు యూనిట్ల రక్తం కూడా ఎక్కించినట్లుగా తెలిసింది.

ఇది కూడా చదవండి: SDLC Tragedy: సొరంగంలో చిక్కుకున్న వారి కోసం విస్తృతంగా సహాయక చర్యలు

పోప్ ఫ్రాన్సిస్.. 2013 నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నతనంలోనే ఫ్లూరిసీ వ్యాధి బారిన పడడంతో ఊపిరితిత్తులో కొంత భాగాన్ని తొలగించారు. దీంతో ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఇక రక్తహీనత కూడా ఉండడంతో ప్లేట్‌లేట్ కౌంట్ కూడా పడిపోవడంతో రక్త మార్పిడి చేశారు. దీని తర్వాత ఆరోగ్యం కొంచెం కుదిటపడినట్లుగా వాటికన్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Virat Kohli: 36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరం: విరాట్