Site icon NTV Telugu

COVID-19: వ్యాక్సిన్ల రక్షణ కొంత కాలమే.. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందే.

Vaccination

Vaccination

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఇబ్బందులకు గురవుతోంది. కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఇక ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇవి వివిధ వేరియంట్లపై ఎలా పనిచేస్తాయి..ఎంతకాలం రక్షణ ఇస్తాయనే విషయంపై స్పష్టత లేదు.

తాజాగా యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాక్సిన్లతో వచ్చని భద్రత తక్కువ కాలమే ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకుంటేనే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుందని అధ్యయనంలో తేలింది. మోడెర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల ద్వారా ఎంత మేర రక్షణ లభిస్తుందనే విషయాలపై అధ్యయనం జరిగింది. ఈ అధ్యయన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించింది.

Read Also: CM KCR Aerial Survey: రేపు ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్‌ సర్వే

టీకాల వేసుకున్నా.. తిరిగి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం టీకాల రకాన్ని బట్టి కూడా ఉంటుందని స్టడీ వెల్లడించింది. అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఎన్ఏ టీకాలై ఫైజర్, మోడెర్నా టీకాలు జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాల కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కవ రక్షణ ఇస్తున్నట్లు తేలింది. ఎం ఆర్ఎన్ఏ టీకాలు అధ్యధిక స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అయితే ఇక్కడ సహజ వ్యాధినిరోధక శక్తి, వ్యాక్సినేషన్ వేరువేరు కాదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల తరువాత వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుందని.. తప్పకుండా బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల కోవిడ్ కు అడ్డుకట్ట వేయవచ్చని వారు వెల్లడించారు.

Exit mobile version