Site icon NTV Telugu

సత్ఫాలితాలు ఇస్తున్న టీకాలు… ఆ దేశాల్లో తగ్గుతున్న కేసులు 

కరోనా కేసులు ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాలను వేగవంతం చేసింది ప్రపంచం.  ఎప్పుడైతే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను తయారు చేశామని ప్రకటించిందో అప్పటి నుంచి ప్రపంచంలోని టాప్ దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి.  ఇండియాలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, ప్రపంచదేశాల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇజ్రాయిల్ తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో అందరికంటే ముందు నిలిచింది.  90 లక్షల జనాభాకలిగిన ఇజ్రాయిల్ లో ఇప్పటికే 50 శాతానికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ ను అందించారు.  అటు యూకే లో కూడా 47శాతం ప్రాణాలకు వ్యాక్సిన్ అందించారు.  వ్యాక్సిన్ వేగవంతం చేసిన తరువాత ఇజ్రాయిల్, యూకే లో కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.  అటు అమెరికాలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.  అయితే, టీకా తీసుకున్న తరువాత ఎంతకాలం పాటు యాంటీబాడీలు శరీరంలో ఉంటాయి అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. 

Exit mobile version