కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. తాజా డేటా ప్రకారం, మైన్స్ రాష్ట్రంలో అత్యధికంగా 62.9 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ను పూర్తి చేశారు. ఆ తరువాత స్థానాల్లో కనెక్టికట్(62.8) వెర్మాంట్ (62.7) ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో మసాచుసెట్స్, రోలర్ ఐలాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
అమెరికా వ్యాక్సినేషన్: 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా…
