USA Shooting Incident: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంభవించింది. ఫిలడెల్ఫియాలోని ఒక బార్ వెలుపల ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో పలువురి షూటర్ల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నల్లటి కారులో వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 12 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులకు అసలు కారణాలను వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. గత కొంత కాలంగా యూఎస్ఏలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Read Also: Honey Trap: ఇంటికి పిలిపించి ఎఫైర్ అంటగట్టారు.. అడ్డంగా బుక్కయ్యారు
న్యూయార్క్ లో అగ్నిప్రమాదం:
న్యూయార్క్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ఓ అపార్ట్మెంట్ లో లిథియం అయాన్ బ్యాటరీ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారని అధికారులు శనివారం వెల్లడించారు. మాన్ హట్టన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నపాటి ఎలక్ట్రిక్ వాహనాలు , పరికరాల కోసం ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు పేలి ఈ ఏడాదిలో అమెరికాలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు.
