NTV Telugu Site icon

USA: విమానాన్ని దొంగిలించిన పైలెట్.. వాల్‌మార్ట్‌ పై కూలుస్తానని హెచ్చరిక

Usa Airplane Theft

Usa Airplane Theft

Pilot Threatens To Crash Plane into Walmart in USA: అమెరికాలో ఓ పైలెట్ విమానాన్ని దొంగిలించి కూల్చేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాలో పైలెట్ గా పనిచేస్తున్న ఓ యువకుడు భద్రతా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వాల్‌మార్ట్‌ పై విమానాన్ని కూలుస్తానంటూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అమెరికాలోని ఈశాన్య మిస్సిస్సిప్పీలోని టుపెలోలోలోని వెస్ట్ మెయిన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

విమానాన్ని దొంగిలించిన పైలెట్ దాదాపు గంటకు పైగా విమానంలో చక్కర్లు కొడుగూ.. ఉద్దేశపూర్వకంగా వాల్‌మార్ట్‌ లోకి దూసుకెళ్తానని బెదిరించాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు వాల్‌మార్ట్‌ ను ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు, పైలెట్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. విమాన కదలికలను బట్టి చూస్తే ప్రమాద తీవ్రత ప్రదేశం ఎక్కువగా ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Read Also: Pakistan: మూడింట ఒకవంతు పాక్ భూభాగం నీటిలోనే.. భారీ వరదలతో ఏర్పడిన సరస్సులు

బెదింపులతో వాల్ మార్ట్ తో పాటు సమీపం దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. అంతా సద్దుమణిగే దాకా.. ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.. ఎమర్జెన్సీ సర్వీసులను అలెర్ట్ చేశారు. పైలెట్ టుపెలో విమానాశ్రయం నుంచి రెండు ఇంజిన్లతో కూడిన 9 సీట్లతో కూడిన బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90ని దొంగిలించారని పోలీసులు వెల్లడించారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని.. గవర్నర్ టేట్ రీవ్స్ వెల్లడించారు.