JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
- ఫ్రాన్స్ హింసాత్మక ఘటనలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు..
- వలసల్ని ప్రోత్సహించిన పాశ్చాత్య ఉదారవాదులే దీనికి కారణమని ఆరోపణ..
- ఫ్రాన్స్ అల్లర్లను గమనించాలని అమెరికన్లకు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Vance:ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక అల్లర్లు, నిరసనలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. వెస్ట్రన్ దేశాల వలసలు, వైవిధ్య విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైవిధ్యం, కరుణ పేరుతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజల్ని తమ దేశాల్లోకి తీసుకువచ్చిన పాశ్చాత్య దేశాల ఉదారవాదులు.. వారు సమాజంతో కలిసిపోతున్నారా అనే విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
సోషల్ మీడియాలో వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన ఫ్రాన్స్ పరిణామాలను ప్రస్తావించారు. ఈ పరిస్థితులు వస్తాయని ముందే హెచ్చరించినప్పటికీ, ఉదారవాదులు ఆ సూచనల్ని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఫ్రాన్స్‌లో మరిన్ని చారిత్రాత్మక కట్టడాలు తగలబడకముందే ఈ ఉన్మాదాన్ని ఆపాలని ప్రార్థిస్తున్నాను’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఫ్రాన్స్ అందమైన దేశమని, అక్కడి చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Also Read
- General Syed Amar Raza: "పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం".. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
ఫ్రాన్స్ అల్లర్లను ఉటంకిస్తూ, దేశంలోని డెమోక్రాట్లపై కూడా జేడీ వాన్స్ ఆరోపణలు చేశారు. అమెరికన్లు ఫ్రాన్స్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించాలని కోరారు. అమెరికా కాంగ్రెస్‌లోని డెమోక్రాట్లు కూడా తమ దేశానికి ఇలాంటి భవిష్యత్తునే కోరుకుంటున్నారని ఆరోపించారు.
ఫ్రాన్స్‌లో విద్యార్థి సమస్యలుగా మొదలైన నిరసనలు ఆ తర్వాత ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ వ్యయాలపై నిరసనగా మారాయి. కొద్ది రోజుల్లో ఫ్రాన్స్ అంతటా హింసాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరి మూకలు వాహనాలను కాల్చడం, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వారసత్వ భవనాలకు నిప్పు పెడుతున్నారు. పోలీసులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ అల్లర్ల వెనక వామపక్ష సంస్థలు, పార్టీలు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!