US Shooting: అమెరికాలో దారుణం.. కాల్పుల్లో ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు

  • అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు..
  • మిషిగన్‌లో డెట్రాయిట్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి.. 19 మందికి గాయాలు..
  • నిందితుడి కోసం గాలిస్తున్న అమెరికన్ పోలీసులు..
Us

Us

US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో గత వారాంతం పలు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపుతుంది. మిషిగన్‌లోని డెట్రాయిట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అనుమానితుల్ని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే, వీకెండ్స్ వేడుకలు అమెరికాలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో జరుగుతాయి.. ఈ సమయంలోనే కాల్పుల ఘటనలు వెలుగులోకి వచ్చింది. ప్రజలు అధిక సంఖ్యలో వేడుకల్లో పాల్గొనడంతో పాటు మద్యం వినియోగం పెరగడం లాంటి కారణాలతో గత వారాంతంలో కాల్పుల ఘటనలు బాగా పెరిగాయని అధికారులు చెప్పుకొస్తున్నారు.

Read Also: Gautam Gambhir: అతడే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్: గంభీర్

అలాగే, శనివారం కెన్టకీలోని ఫ్లోరెన్స్ ఏరియాలో వెలుగు చూసిన కాల్పుల ఘటనలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఓ ఇంట్లో 21 ఏళ్ల కుమారుడి పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల నిందితుడు వారిపై కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని వెంబడించగా అతడి కారు అదుపు తప్పి గొయ్యిలో పడిపోయిందన్నారు. అప్పటికే నిందితుడు తనని తాను తుపాకీతో కాల్చుకుని.. హస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు బాధితుడికి పరిచయస్తుడే.. ఆ పార్టీకి అతడికి పిలవకపోవడం వల్లే ఈ కాల్పులకు తెగబడ్డాడు అని పోలీసులు వెల్లడించారు.