Trump: వెనిజులాపై అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, అమెరికా తీసుకువచ్చారు. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ఈ రోజు దాడులు నిదర్శనంగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెనిజులాను టార్గెట్ చేశారు. అమెరికాలోకి డ్రగ్స్ సరఫరాకు వెనిజులా పాత్ర ఉందని, డ్రగ్స్ సూత్రధారులతో మదురోకు సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా అమెరికాలోకి వెనిజులా ఖైదీలను బలవంతంగా పంపిస్తోందని అన్నారు.
Read Also: Naa Anveshana : నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్..!
ఇదిలా ఉంటే, చాలా మంది అంతర్జాతీయ నిపుణులు ట్రంప్ వెనిజులా చమురు, సహజ వనరులను కొల్లగొట్టేందుకు దాడులకు తెగబడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు నిజం చేకూరుస్తూ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులా చమురు పరిశ్రమల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయని శనివారం అన్నారు. మాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీలు ఉన్నాయని, అవి వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీలో పాల్గొంటాయని అన్నారు.
