Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఈరోజు (జనవరి 10) శిక్ష విధిస్తామని ఇప్పటికే న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు. అయితే, నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే ఛాన్స్ మాత్రం లేదని పేర్కొన్నారు. శిక్ష విధించినా తన అధికారాన్ని, అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తించే విధంగానే ఉండబోతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ కోరారు. అయితే, అమెరికాకు కాబోయే అధ్యక్షుడి పిటిషన్ ను తిరస్కరించింది.
Read Also: Game Changer Review: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ రివ్యూ!
ఇక, సుప్రీంకోర్టు పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మా న్యాయ వ్యవస్థను ఆయుధీకరించడం తప్ప మరొకటి కాదు అన్నారు. దీనిని లాఫేర్ అని పిలుస్తారంటూ సెటైర్ వేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇలాంటిదేమీ ఇప్పటి వరకు జరగలేదని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. కాగా, సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం.. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ భారీగా డబ్బులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.