Site icon NTV Telugu

Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్‌ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..

Usa, Peanut Allergy

Usa, Peanut Allergy

Peanut Allergy: అమెరికాకు చెందిన 23 ఏళ్ల యువతి అనూహ్యంగా మరణించింది. అలిసన్ పికరింగ్ అనే యువతి ‘‘పీనట్ ఎలర్జీ’’కి గురై చనిపోయింది. రెస్టారెంట్‌‌లో అనుకోకుండా వేరుశెనగ తినడంతో ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురై మరణించింది. తెలిసిన రెస్టారెంట్‌లో డేటింగ్‌కి వెళ్లిన సమయంలో ఆమె ఈ అలర్జీకి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు తన అలర్జీ గురించి తెలుసు, చాలా సందర్భాల్లో ఆమె తీసుకునే ఆహారంపై కీలక దృష్టి ఉంచుతుందని కుటుంబీలకు తెలిపారు.

Read Also: Sambhal Violence: యోగితో అట్లుంటది.. సంభాల్ హింసకు పాల్పడి వారి నుంచి నష్టపరిహారం..

తెలిసిన రెస్టారెంట్‌లో ఎప్పుడూ ఆర్డర్ చేసే వంటకం ‘‘మహి మహి’’ని ఆర్డర్ చేసింది. అయితే, రెస్టారెంట్ ఈ రెసిపీలో మార్పులు చేసిన విషయం ఆమెకు తెలియదు. సాధారణంగా ఎప్పుడు ఆ రెస్టారెంట్‌కి వెళ్లినా ఇదే ఆహారాన్ని ఆర్డర్ చేస్తుందని అలిసన్ తండ్రి గ్రోవర్ పికరింగ్ చెప్పారు. రెస్టారెంట్ ఈ రెసిపీకి ‘‘పీనట్ సాస్’’ చేర్చడాన్ని రెస్టారెంట్ యాజమాన్యం అలిసన్‌కి తెలియజేయలేదు. ఆమె కొన్ని ముక్కలు తిన్న వెంటనే ఏదో తేడాగా ఉన్నట్లు గ్రహించిందని గ్రోవర్ చెప్పారు. ఆబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు.

అలిసన్ ‘‘తీవ్రమైన అనాఫిలాక్టిక్ షాక్’’తో బాధపడుతున్నారు. అనాఫిలాక్సిస్ అనేది త్వరగా సంభవించే ప్రాణాంతక అలెర్జీ రియాన్. ఇది అత్యంత తీవ్రమైన రూపం. ఇది వ్యక్తి స్పృహ కోల్పేయేలా చేయడంతో పాటు, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది, శరీర కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలిసన్ మరణం కొత్త చర్చకు దారి తీసింది. పుడ్ అలర్జీ అవేర్‌నెస్ కోసం చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆహార సేవల సంస్థలు తమ సిబ్బందికి ఆహార అలర్జీకి సంబంధించి తగిన శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.

Exit mobile version