
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. కరోనా మహమ్మారి తో అమెరికా అతలాకుతలం అయ్యింది. కరోనా నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున అక్కడ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి 1 మిలియన్ డాలర్లు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ప్రతి వారం లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకోవచ్చని ప్రకటించారు. మొదటి వారం లాటరీ విజేతను మే 26 వ తేదీన ప్రకటించనున్నారు.