Site icon NTV Telugu

జో బైడెన్ కీల‌క ప్ర‌క‌ట‌నః ప్ర‌పంచ దేశాల‌కు 8 కోట్ల డోసులు

మ‌హమ్మారిని త‌రిమికొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌యత్నాలు చేస్తున్నాయి.  ఈ విష‌యంలో అమెరికా ముందు వ‌ర‌స‌లో ఉన్న‌ది.  ఇప్ప‌టికే దేశంలో 60శాతం మందికి వ్యాక్సిన్‌ను అందించింది.  అయితే, దేశ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించ‌డ‌మే కాకుండా, పేద దేశాల‌కు కూడా వ్యాక్సిన్‌ను అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ఇప్పటికే అమెరికా 2.5 కోట్ల డోసుల‌ను వివిధ దేశాల‌కు అందించింది.  

Read: సెట్స్ పైకి పవన్-రానా హీరోయిన్స్!

దీంతో పాటుగా మ‌రో 5.5 కోట్ల డోసుల‌ను కూడా అందిస్తున్న‌ట్టు అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.  ప్ర‌పంచ  ఆరోగ్య సంస్థ ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కోవాక్స్ సంస్థ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను ల‌బ్ది దేశాల‌కు అందించ‌నున్నారు.  ఈ నెలాఖ‌రు వ‌ర‌కు కోవాక్స్‌కు వ్యాక్సిన్‌ల‌ను అందిస్తామ‌ని అమెరికా హామీ ఇచ్చింది.  

Exit mobile version