Site icon NTV Telugu

బ్రిట‌న్ ప్ర‌ధానికి అమెరికా అధ్య‌క్షుడు ఖ‌రీదైన బ‌హుమ‌తి… ఎంటో తెలుసా?

బ్రిట‌న్‌లో జీ7 దేశాల స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది.  ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ హాజ‌ర‌య్యారు.  అమెరికా, బ్రిట‌న్ మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా స‌ద‌స్సులో పాల్గోన్న అనంత‌రం ఇరు దేశాల అధిప‌తులు బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకుంటారు.  బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కోసం ప్ర‌త్యేక బ‌హుమ‌తిని తీసుకొచ్చారు.  పూర్తిగా చేత్తో త‌యారు చేసిన సైకిల్‌ను ఆయ‌న‌కు బ‌హుక‌రించారు.  ఈ సైకిల్‌పై బ్రిట‌న్ జెండా గుర్తు ఉంటుంది.  పూర్తిగా చేత్తో త‌యారు చేసిన ఈ సైకిల్ ఖ‌రీదు ఆరువేల డాల‌ర్లు.  ఇక ఇదిలా ఉంటే, అమెరికా అధ్య‌క్షుడి కోసం అదే రేంజ్‌లో అదిరిపోయో గిఫ్ట్‌ను అంద‌జేశారు.  అమెరికాలో బానిస‌త్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన ఫెడ్రిక్ డ‌గ్ల‌స్ ఫొటోను బ‌హుమ‌తిగా అంద‌జేశారు. 

Exit mobile version