అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త అవతారం ఎత్తారు. పోప్ అవతారంలో దర్శనం ఇచ్చారు. కొత్త అవతారానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. తనకు తాను పోప్‌గా ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు.
ఇది కూాడా చదవండి: Goa Stampede: గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 50 మందికి గాయాలు
పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల కన్నుమూశారు. తదుపరి పోప్ ఎన్నిక త్వరలో జరగనుంది. ఇది అత్యంత రహస్యంగా ఈ ఎన్నిక జరగనుంది. అయితే ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ట్రంప్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకర్లు ట్రంప్‌ను ప్రశ్నిస్తూ… కొత్త పోప్‌గా ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారని అడిగారు. దీనికి ట్రంప్ సమాధానం ఇస్తూ ‘‘పోప్ నేనే అవ్వాలనుకుంటున్నాను’’ అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి అన్నట్టుగానే ట్రంప్ పోప్ అవతారం ఎత్తేశారు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూాడా చదవండి: RCB vs CSK: ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీ కన్ను.. నేడు చెన్నైతో ఢీ
