Site icon NTV Telugu

Iran-US: ఈ రాత్రికి ఇరాన్‌పై అతి పెద్ద దాడి జరగబోతున్నట్లుగా ప్రచారం.. అంతర్జాతీయ కథనాలు

Iranisrael

Iranisrael

బాబోయ్.. మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. నిన్నటి నుంచి యుద్ధం భీకరంగా జరుగుతోంది. టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లను.. ఎయిర్‌పోర్టును పేల్చేసింది.

తాజాగా మరింత భయాందోళనకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రాత్రికి ఇరాన్‌పై అగ్ర రాజ్యం అమెరికా అతి పెద్ద బాంబు దాడి చేయబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. శనివారం రాత్రి ఇరాన్‌పై అతి పెద్ద బాంబు దాడి చేయబోతున్నట్లుగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానియన్ క్షిపణి లాంచర్లు, క్షిపణులను నిర్మించే కర్మాగారాలను నాశనం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించడం కోసమే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిందని ఆరోపించారు.

ఇరాన్ సైన్యం తుడుచుకు పెట్టుకుపోయిందని… వారి నావికాదళం కూడా పోయిందని.. అలాగే వారి కమ్యూనికేషన్లు కూడా దెబ్బతిన్నట్లుగా ట్రంప్ తెలిపారు. నాయకులు కూడా పోయారని పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర 32 నౌకలు ఉన్నాయని.. మొత్తం సముద్రపు అడుగు భాగంలో ఉన్నాయని తెలిపారు. ఇక ఇరాన్ బేషరతుగా లొంగిపోయింత వరకు చర్చలు జరపబోమని చెప్పారు. ఇక ఇజ్రాయెల్‌కు కొత్తగా 1251 మిలియన్ల ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదించింది.

Exit mobile version