Site icon NTV Telugu

Fighter Jets for Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధ విమానాలు

Fighter Jets For Ukraine

Fighter Jets For Ukraine

Fighter Jets for Ukraine: దాదాపుగా 5నెలలుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. తూర్పు యూరోపియన్ దేశానికి తన సైనిక సాయాన్ని పెంచడానికి అమెరికా ఆలోచిస్తోందని వైట్‌హౌస్ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. పెంటగాన్ ఇప్పుడు ఉక్రేనియన్ దళాలకు ఫైటర్ జెట్‌లను అందించడాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి. పెంటగాన్ ఉక్రేనియన్లకు యుద్ధ విమానాలను అందించగల సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తోందని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

ఈ చర్య యుద్ధంలో అమెరికా ప్రమేయాన్ని విస్తరిస్తుందని.. రష్యాతో తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలోనే ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అమెరికాను హెచ్చరించింది. ఇకపై అమెరికా ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణుల సరఫరాను ప్రారంభిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమెరికా అలా చేస్తే రష్యా ఇకపై కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపితే రష్యా.. ఇప్పటి వరకూ దాడి చేయని కొత్త లక్ష్యాలపై గురి పెట్టాల్సి వస్తుందని పుతిన్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చేశారు.

YouGov survey: బ్రిటన్ ప్రధాని పదవి రేసు… సీన్‌ రివర్స్‌..!

పోలాండ్, మార్చిలో మిగ్-29 విమానాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. అయితే పెంటగాన్ దానిని ప్రమాదంగా పేర్కొంటూ తిరస్కరించింది. అమెరికా ముందు పరిష్కరించాల్సిన సమస్యలు జెట్ నిర్వహణపై ఉక్రేనియన్లకు శిక్షణ ఇవ్వడం, విడిభాగాలను అందించడం లాంటివి చేయాలని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. యూఎస్ ఏ రకమైన విమానాన్ని పరిశీలిస్తోంది, నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందనే దాని గురించి ఆయన ఏమీ వెల్లడించలేదు.
ఎఫ్-15, ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు పంపేందుకు ఎంపిక చేయపడ్డాయి. అయితే ఈ రెండు విమానాలకు గణనీయమైన శిక్షణ, నిర్వహణ అవసరం అని మాజీ పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు.

Exit mobile version