NTV Telugu Site icon

Israel: ఇరాన్ చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు ఫ్లాన్.. యూఎస్‌ మీడియాలో కథనాలు

Usmedia

Usmedia

ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది. మొత్తానికి ఇరాన్ యుద్ధానికి ఆజ్యం పోసింది. ఇరాన్‌ను ముందుగానే అమెరికా హెచ్చరించింది. దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయినా కూడా అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌పై క్షిపణుల దాడికి దిగింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సాయంతో గగనతంలోనే ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని మాత్రం టెల్‌అవీవ్ ప్రాంతంలో పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగబోతుందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ చమురు, అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగబోతున్నట్లుగా అమెరికా మీడియా పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కూడా ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేయడం ఇది రెండో సారి. ఏప్రిల్‌లో ఇదే తరహామైన దాడి చేయడంతో మిత్ర రాజ్యాల సహకారంతో తిప్పికొట్టింది. మంగళవారం కూడా అదే తరహాలో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని క్షిపణులు మాత్రం టెల్‌అవీవ్‌పై పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లుగా సమాచారం. ఇటీవల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది.

Show comments