US Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించేశాయి. ఆయా కంపెనీలతో దశాబ్ధాల కాలం అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా తొలగించాయి. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఊడాయి. అమెరిలో ఉద్యోగాల తొలగింపు గత రెండేళ్లలో గరిష్టా స్థాయికి చేరుకున్నట్లు ప్రముఖ ఉపాధి సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ వెల్లడించింది. ఏకంగా 1,02,943 మంది తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు డిసెంబర్ నుంచి రెండు రెట్లు, గతేడాదితో పోలిస్తే 5 రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
Read Also: Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌పై కేంద్రం క్లారిటీ..
అదిక ద్రవ్యోల్భనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు ఆర్థికమాంద్యం భయాలను పెంచుతున్నాయి. మరోవైపు కంపెనీలు ఆదాయం తగ్గింది. దీంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి కంపెనీలు. దీంతోనే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత నెలలో మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులను చేపట్టాయి. గత నెలలో అమెరికాలో 41,829 ఉద్యోగాలు పోయాయి. ఇందులో టెక్ సంస్థల ఉద్యోగాలే అధికం. ఆ తరువాత స్థానంలో రిటైలర్ రంగం 13,000 మందిని తొలగించింది. ఆర్థిక సంస్థలు 10,603 ఉద్యోగులను తొలగించాయి.
గతేడాది నవంబర్-డిసెంబర్ లో ప్రారంభం అయిన తొలగింపుల పర్వం ఈ ఏడాది జనవరిలో గరిష్టానికి చేరుకుంది. రానున్న కొన్ని రోజుల్లో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతాయనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 18,000 మందిని, మెటా 11,000, గూగుల్ 12,000, మెక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది.
