Site icon NTV Telugu

Ban on TikTok: గూఢచర్యం భయం..! టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం బ్యాన్‌

Tiktok

Tiktok

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత.. చైనాకు చెందిన చాలా యాప్‌లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం.. అందులో అప్పటికే కోట్లాది మంది భారతీయుల అభిమాన్ని చురగొన్న టిక్‌టాక్‌ యాప్‌ కూడా ఉంది.. ఎంతో మంది కొత్త కళాకారులను.. చాలా మందిలోని టాలెంట్‌ను బయటకుతీసిన టిక్‌టాక్‌ బ్యాన్‌తో చాలా మంది అసంతృప్తికి గురయ్యారు.. అయితే, ఆ తర్వాత భారత్‌ బాటలో మరికొన్ని దేశాలు.. టిక్‌టాక్‌ సహా పలు చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ వచ్చాయి.. ఇప్పుడు ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధం అవుతోంది.. యూఎస్‌లోని రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఒక బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టారు.. తమ దేశస్తులపై నిఘా కోసం చైనా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చేమోనన్న ఆందోళనను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు..

Read Also: IND vs BAN 1st Test Day 1: ముగిసిన తొలిరోజు ఆట.. అర్థశతకాలతో ఆదుకున్న పుజారా, అయ్యర్

ఈ బిల్లును రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మార్కో రూబియో, మైక్‌ గల్లాఘర్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రష్యా, చైనాల ప్రభావం ఉన్న ఏ సోషల్‌ మీడియా కంపెనీనైనా బ్యాన్‌ చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి లభిస్తుంది. దీనిపై రిబియో మాట్లాడుతూ బీజింగ్‌ ఆధీనంలోని టిక్‌టాక్‌ను అమెరికా ప్రయోజనాల కోసం నిషేధించాలని పేర్కొన్నారు.. టిక్‌టాక్‌ నుంచి అమెరికా వినియోగదారులకు ఉన్న ముప్పు నుంచి రక్షించేందుకు.. అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గం.. ఇప్పటి వరకు చర్య తీసుకోలేదంటూ మండిపడ్డారు.. కాగా, చైనా ప్రభుత్వంతో తాము ఎలాంటి డేటాను పంచుకోవడంలేదంటూ గతంలోనే టిక్‌టాక్‌ స్పష్టం చేసింది.. ఇక, తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపితమైన నిషేధం అని చెప్పుకొచ్చింది.. అయితే, అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధించాలన్న ఆలోచన మాత్రం ఇప్పటిది కాదు.. ఎందుకంటే.. గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ కూడా టిక్‌టాక్‌పై నిషేధానికి యత్నించింది.. కానీ, అది సాధ్యపడలేదు.. మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.. కొందరు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు రాజకీయ ఉద్దేశాలతో ఈ బిల్లును తీసుకొచ్చారని కొట్టిపారేస్తున్నారు.. దీంతో అమెరికా జాతీయ భద్రతకు అదనంగా లభించే ప్రయోజనం ఏమీ ఉండబోదని కొట్టిపారేస్తున్నారు..

Exit mobile version