US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..
- తెరిచి ఉన్న హార్ముజ్‌ను యుద్ధం చేసి తెరిపిస్తు్న్న అమెరికా..
- ఇరాన్ యుద్ధంలో లక్ష్యాలు మారాయి..
- ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య సంధిలో కీలకంగా హార్ముజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్ యుద్ధాన్ని ఏ లక్ష్యాల కోసం అమెరికా, ఇజ్రాయిల్ మొదలుపెట్టాయో ఆ లక్ష్యాలకు దూరంగా యుద్ధం వెళ్లింది. యుద్ధానికి ముందు వారం, పది రోజుల్లో ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుందని అమెరికా భావించింది. అయితే, నెల రోజులు దాటినా ఇరాన్ గట్టిగా నిలబడింది. ఇజ్రాయిల్, యూఎస్ దాడుల్ని తిప్పికొడుతోంది. తమకు ప్రమాదం వస్తే ఎలా స్పందిస్తామో, గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్లకు ఇరాన్ రుచి చూపించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు ఈ దేశాల్లో ఆయిల్ గ్యాస్ ఫెసిలిటీలపై దాడులు చేసింది.
అసలు లక్ష్యాలు వెనక్కి:
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
నిజానికి యుద్ధంలో ఇరాన్ నాయకత్వాన్ని నామరూపాలు లేకుండా చేసి, ఆ దేశంలో పాలనా మార్పులు తీసుకురావాలని అమెరికా భావించింది. అయితే, అది సాధ్యం కాలేదు. చివరకు ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించారు. ఇది కూడా సాధ్యపడలేదు. ఇరాన్లో భూతల దాడులకు ట్రంప్ మొదటగా ప్లాన్ చేసినా, అది చాలా రిస్కీ కావడంతో ఈ ఆపరేషన్ చేసే సాహసాన్ని అమెరికా చేయలేదు.
భారీ స్థాయిలో నష్టాలు:
ఇదిలా ఉంటే, అమెరికా వరసగా తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థల్ని కోల్పోతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకోలేకపోయింది. ఇక ప్రపంచంలో ఎంతో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్స్ అయిన ఎఫ్-15, ఎఫ్-35 వంటి వాటిని కూడా ఇరాన్ కూల్చేయడం సంచలనంగా మారింది. చివరకు ఇరాన్ నేలపై దిగిన యూఎస్ పైలట్‌ను రక్షించుకునేందుకు అమెరికా పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
హార్ముజ్ జలసంధి కీలకం:
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో అసలు విచిత్రం ‘‘హార్ముజ్ జలసంధి’’. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఎంతో కీలకమైన ఈ నౌకా మార్గాన్ని ఇరాన్ మూసేసింది. ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా జరుగుతోంది. యుద్ధం ముందు లక్ష్యాలు ఒకలా ఉంటే, యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రాధాన్యతలు మారాయి. విచిత్రం ఏంటంటే యుద్ధానికి ముందు తెరిచి ఉన్న హార్ముజ్ జలసంధిని, యుద్ధం చేసి మరీ తెరిపించాల్సి వస్తోంది. ఇప్పుడు హార్ముజ్ తెరవాలని ట్రంప్ ఇరాన్‌ను పదే పదే హెచ్చరిస్తు్న్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య సంధి కుదరడానికి ‘‘హార్ముజ్’’ కీలకంగా మారింది.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?