US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..
- ఇరాన్‌లో అమెరికన్ పైలట్ గురించి సెర్చింగ్..
- తన కొడుకు కోసం ప్రార్థించాలని పైలట్ తల్లి భావోద్వేగ పోస్ట్..
- తీవ్రంగా స్పందించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. నెల రోజులు దాటినా, ఇరు పక్షాల మధ్య దాడులు ఆగడం లేదు. మరోవైపు, ఇరాన్ అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చడం సంచలనంగా మారింది. ఏ-10 అటాక్ విమానాన్ని కూడా ఇరాన్ కుప్పకూల్చింది. అయితే, ఎఫ్-15 కూలిపోతున్న సమయంలో ఇద్దరు పైలట్లు విమానం నుంచి బయటపడ్డారు. వీరిలో ఒకరిని అమెరికన్ బలగాలు రెస్క్యూ చేశాయి. మరొకరి ఆచూకీ ఇప్పటికే తెలియరాలేదు.
Read Also: Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ఇదిలా ఉంటే, గల్లంతైన పైలట్ తల్లి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తప్పిపోయిన పైలట్ తమ కుమారుడే అని, అతడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, తన కుమారుడి కోసం అలాగే ఇతర పైలట్లందరి కోసం ప్రార్థించమని ఆమె అందరినీ కోరారు.
అయితే, ఆమె పోస్ట్‌పై పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు స్పందించాయి. ‘‘ఇరాన్ చెరలో సురక్షితంగా ఉండటం కన్నా డొనాల్డ్ ట్రంప్ తోనే మీ కుమారుడికి ఎక్కువ ప్రమాదం. అమెరికన్ రెస్క్యూ బృందాల అతడిని కనుగొనే వరకు అతను ఇరాన్ చెరలోనే ఉండేలా ప్రార్థించండి’’ అంటూ పాకిస్తాన్ లోని ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇక సౌతాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం.. ఇరాన్ ఖైదీలను గౌరవంగా చూస్తుందని, ఇరాన్‌కు చాలా ప్రాచీన నాగరికత ఉందని, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ లాగా ఖైదీలను క్రూరంగా హింసించదని రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!