US-Iran Talks: అమెరికాతో తదుపరి చర్చలపై ఇరాన్ కీలక ప్రకటన!

  • మరోసారి చర్చలకు సిద్ధపడుతోన్న అమెరికా-ఇరాన్
  • క్లారిటీ ఇచ్చిన పాకిస్థాన్‌లోని ఇరాన్ ఎంబసీ
  • ఈసారైనా చర్చలు ఫలించేనా?
Iran Announces

Iran Announces

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు జరిగిన చర్చలు ఎలాంటి సత్‌ఫలితాన్ని ఇవ్వకుండా అర్ధాంతరంగా ముగిసిపోయాయి. దీంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సైన్యానికి ఆదేశించారు. దీంతో హార్ముజ్ జలసంధి దగ్గర మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఇది కూడా చదవండి: PM Modi: నూతన వధూవరులకు క్షమాపణలు చెప్పిన మోడీ.. కారణమిదే! వీడియో వైరల్

ఈ నేపథ్యంలో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగబోతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఎప్పుడు.. ఎక్కడా? ఏంటి? అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చర్చలపై స్పష్టత వచ్చింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య తదుపరి విడత చర్చలు ఈ వారం లేదా వచ్చే వారం ప్రారంభంలో జరగవచ్చని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ అధికారి తెలిపినట్లుగా రాయిటర్స్ నివేదించింది. అయితే ఈసారి చర్చలు టర్కీ లేదా జెనీవాలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Kejriwal vs Judge: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరు.. జస్టిస్‌పై కేజ్రీవాల్ ఆరోపణలు వైరల్

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగత లభించలేదు. ఇకపై ఇరాన్ అణు కార్యక్రమానికి దూరంగా ఉండాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేస్తోంది. కానీ అందుకు ఇరాన్ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలు విఫలం అయ్యాయి.