NTV Telugu Site icon

USA: తన రసాయన ఆయుధాలను పూర్తిగా నాశనం చేసిన అమెరికా..

Usa

Usa

USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.

కెంటుకీలోని యుఎస్ ఆర్మీ ఫెసిటిలీ బ్లూ గ్రాస్ ఆర్మీ డిపోలో ఉన్న చివరి బ్యాచ్ 500 టన్నుల ప్రాణాంతక రసాయన ఆయుధాలను ధ్వంసం చేసింది. పలు దశాబ్ధాలుగా యూఎస్ లో ఉన్న మస్టర్డ్ గ్యాస్, వీఎక్స్ అండ్ సారిన్ నర్వ్ ఏజెంట్స్, బ్లిస్టర్ ఏజెంట్స్ వంటి ప్రమాదకర రసాయన ఆయుధాలను సురక్షితంగా నాశనం చేసింది. ప్రమాదకర ఆయుధాలను రోబోలు జాగ్రత్తగా విడదీసి, కడిగి, 1500 ఫారెన్ హీట్ ఉష్ణానికి గురిచ చేసి నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ ఆయుధాలను నాశనం చేయడానికి దాదాపుగా కొన్ని దశాబ్ధాలు పట్టాయని సైన్యం పేర్కొంది.

Read Also: Mrunal Thakur : వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ న్యూ లుక్..

మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఆయుధాల భయంకరమైన ఫలితాలను చూసిన తర్వాత వీటి ఉపయోగంపై అన్ని దేశాలు భయపడ్డాయి. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ 1993లో అంగీకరించారు. ఇది 1997 అమలులోకి వచ్చింది. దీని ప్రకారం అమెరికా ఈ ఆయుధాలను నాశనం చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన ఇతర దేశాలు ఇప్పటికే తమ ఆయుధాలను ధ్వంసం చేసినట్లు రసాయన ఆయుధాల నిషేధ సంస్థ(OPCW) అధిపతి ఫెర్నాండో అరియాస్ మేలో తెలిపారు. ఒక్క అమెరికా మాత్రమే మిగిలి ఉందని ఆయన ఆ సమయంలో పేర్కొన్నారు.

OPCW ప్రకారం 70,000 టన్నులకు పైగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలు నాశనం చేయబడ్డాయి. US ఆయుధ నియంత్రణ సంఘం ప్రకారం, 1990లో యునైటెడ్ స్టేట్స్ దాదాపు 28,600 టన్నుల రసాయన ఆయుధాలను కలిగి ఉంది. రష్యా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన ఆయుధాలు కలిగి ఉంది అమెరికా. రష్యా తన సొంత నిల్వలను 2017లోనే నాశనం చేసింది. ఏప్రిల్ 2022 నాటికి అమెరికా వద్ద 600 టన్నుల కంటే తక్కువ నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి.

Show comments