Site icon NTV Telugu

US-Russia: యూఎస్-రష్యా మధ్య ప్రతిష్టంభన.. ఆయిల్ ట్యాంకర్ సీజ్ చేసిన అమెరికా…

Us

Us

US-Russia: రష్యన్ ప్లాగ్ కలిగిన ఆయిల్ ట్యాంకర్‌ను యూఎస్ దళాలు సీజ్ చేశాయి. అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తున్న ‘మరినెలా’ అనే ఈ చమురు ట్యాంకర్‌ను గత రెండు వారాలుగా యూఎస్ ట్రాక్ చేస్తోంది. వెనిజులాతో సంబంధ ఉన్న ఈ ట్యాంకర్‌ను యూఎస్ నియంత్రించేందుకు ప్రయత్నించింది. దీంతో, యూరప్ సముద్ర తీరాల్లో రెండు దేశాల మధ్య ఉద్రికత్త నెలకొంది. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో, రష్యా యుద్ధ నౌకలు, ఒక సబ్‌మెరీన్ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.

Read Also: Chiranjeevi: కళ్లు చెమర్చే వీడియో..మెగాస్టార్ ఒడిలో ఆ చిన్నారి.. చిరంజీవి మాటలకు నెటిజన్లు ఫిదా!

రష్యన్ మీడియా చెబుతున్న దాని ప్రకారం.. అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా ‘మరినెలా’ అనే ట్యాంకర్‌ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. అమెరికన్ కోస్ట్ గార్డ్ నౌక చాలా రోజులగా ట్యాంకర్‌ను వెండిస్తున్నట్లు పేర్కొంది. యూఎస్ కోస్ట్ గార్డ్ ఓడపైకి ఎక్కేటప్పుడు మారినెలా సమీపంలో రష్యన్ నౌకలు లేవని న్యూ్యార్క్ టైమ్స్ నివేదించింది. దీని వల్ల యూఎస్, రష్యన్ దళాల మధ్య ప్రతిష్టంభన తప్పిందని చెప్పింది.

నిజానికి బెల్లా-1 అని పిలిచే ఈ ట్యాంకర్‌పై 2024లో అమెరికా ఆంక్షలు విధించింది. దీని పేరును ‘మారినెరా’గా మార్చారు. ఇది ఇరాన్ నుంచి వెనిజులాకు ప్రయాణిస్తోంది. అయితే, వెనిజులా జలాల్లో అమెరికా దిగ్భందాన్ని తప్పించుకునేందుకు, దిశను మార్చుకుని అట్లాంటిక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Exit mobile version