Site icon NTV Telugu

Trump Tariffs: ట్రంప్కి షాక్.. ఆ సుంకాలు చట్ట విరుద్ధమని కోర్టు ఫైర్

Donald

Donald

Trump Tariffs: సుంకాల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. యూఎస్ అధ్యక్షుడు తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి ఎక్కువ సుంకాలను పెంచినట్లు చెప్పుకొచ్చింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చింది. భారీగా విధించిన పన్నులు పలు దేశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్‌ నెల మధ్య నాటికి కొనసాగించడానికి జడ్జిలు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అప్పీల్ల కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్‌ సుప్రీంకోర్టులో పోరాటం చేయనున్నారు.

Read Also: HYD Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో సేవలు పొడిగింపు..

అయితే, ఈ నిర్ణయంపై కోర్టును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. అన్ని దేశాలపై విధించిన టారీఫ్స్ ప్రస్తుతం అమల్లో ఉండగా.. వాణిజ్య భాగస్వాములపై వేసిన సుంకాలను తొలగించాలని అప్పీళ్ల కోర్టు పక్షపాతంగా తీర్పు ఇచ్చిందని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చివరకు యూఎస్ విజయం సాధిస్తుంది.. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు ఏర్పడుతుందన్నారు. దేశం మరింత బలపడాలంటే.. సుంకాల పెంపు ఉండాల్సిందే.. లేదంటే, ఆర్థికంగా బలహీనపడిపోతుందన్నారు. యూఎస్ వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి ఈ పన్నులు విధించినట్లు పేర్కొన్నారు. మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్‌లను అమెరికా సహించదని ట్రంప్ వెల్లడించారు.

Read Also: Off The Record : టీడీపీ వర్సెస్ జనసేన పోయి.. జనసేన వర్సెస్ జనసేన

ఇక, ఒక వేళ టారిఫ్‌లను ఎత్తివేసే నిర్ణయం అమెరికాను తీవ్రంగా నాశనం చేస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. మన కార్మికులకు సాయం చేయడానికి ఇదొక్కటే మార్గం అన్నారు. యూఎస్ ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు సపోర్టుగా ఉండాలి.. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు సుంకాలను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారని తెలిపారు. యూఎస్‌ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అగ్రరాజ్యాన్ని బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version