Site icon NTV Telugu

US: నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు.. విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్‌

Us

Us

భారత సంతతికి చెందిన ఒక మహిళ అమెరికా స్టోర్‌లో దొంగతనానికి పాల్పడింది. ఏడు గంటల పాటు స్టోర్‌లో తిరిగి రూ.లక్షకు పైగా వస్తువులను దొంగింలించింది. డబ్బులు చెల్లించకుండా బయటకు వెళ్లిపోతుండగా పట్టుబడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎంబసీ.. విదేశీయులకు వార్నింగ్ ఇచ్చింది. యూఎస్‌ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో నేరాలకు పాల్పడేవారు అమెరికాకు రాకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని హెచ్చరించింది. అగ్ర రాజ్యంలో భారతీయ మహిళ దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!

భారతీయ పౌరురాలు ఇల్లినాయిస్ టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్లింది. అక్కడ టార్గె్ట్ రిటైల్ స్టోర్‌కు వెళ్లింది. మా అయితే స్టోర్‌లో ఒక గంట.. రెండు గంటల్లో పని పూర్తవుతుంది. కానీ ఇల్లినాయిస్ ఏకంగా ఏడు గంటల పాటు స్టోరీలోనే ఉంది. ట్రాలీలో రూ.లక్షకు పైగా వస్తువులను వేసుకుని బయటకు జారుకుంటోంది. సిబ్బంది గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె దానికి బిల్లు చెల్లించింది. అయితే దొంగతనంపై స్టోర్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పోలీసులు కూడా అరెస్ట్‌పై అధికారికంగా ఏం వెల్లడించలేదు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి

ఈ నేపథ్యంలోనే నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలే కాదు.. దానివల్ల మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని వార్నింగ్ ఇచ్చింది. శాంతిభద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని… విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఎంబసీ కోరింది.

 

Exit mobile version