Site icon NTV Telugu

US-Iran War: ఇరాన్‌లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక

Us

Us

పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మధ్యప్రాచ్యం యుద్ధం ప్రారంభమై 27 రోజులైంది. ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

తాజాగా భద్రతాపరమైన ముప్పు కలిగి ఉన్న నేపథ్యంలో ఇరాక్‌ను విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం పౌరులను కోరింది. ఈ మేరకు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న సాయుధ బృందాలు.. కుర్దిష్ ప్రాంతంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని పేర్కొంది.

ఇక ఇరాక్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ దాడుల ముప్పు కొనసాగుతున్నందున అమెరికా పౌరులు వెంటనే ఇరాక్‌ను విడిచి వెళ్లాలని సూచించింది. బాగ్దాద్‌లోని రాయబార కార్యాలయాన్ని గానీ, ఎర్బిల్‌లోని కాన్సులేట్‌ను గానీ సందర్శించవద్దని హెచ్చరించింది. ఇక విమాన ప్రయాణాలకు అంతరాయం కొనసాగుతున్నందున.. దేశం విడిచి వెళ్లాలనుకునే వారు జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ వంటి పొరుగు దేశాలకు భూమార్గాల ద్వారా వెళ్లాలని సిఫార్సు చేసింది.

ఇది కూడా చదవండి: PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా లీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన, గ్యాస్ క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి.

ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం

Exit mobile version